'చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి'
MNCL: విద్యార్థులు చెడువ్యసనానికి దూరంగా ఉంటూ చదువులో ఉన్నతంగా రాణించాలని జైపూర్ ఎసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. నీల్వాయి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్‌తో కలిసి సోమవారం మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. గంజాయి, గుట్కా, మట్కా, మద్యంకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.