ఒంటరి ఏనుగు హాల్ చల్
TPT: చంద్రగిరి మండలం శేషాపురం పరిసరాల్లో ఒంటరి ఏనుగు హాల్ చల్ సృష్టించింది. అటు అధికారులను, ఇటు గ్రామస్తులను ముప్పుతిప్పలు పెడుతుంది. నాలుగు రోజుల క్రితం ఒంటరి ఏనుగు అటవీ అధికారులపై తిరగబడింది. ఎల్లంపల్లిలో నాలుగు ఏనుగుల గుంపు విరుచుకుపడింది. మోటర్లు, ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన పంటను నాశనం చేయడం రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.