'గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి'
SRPT: అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి నాయక్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేటలోని కలెక్టరేట్‌లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి నిర్వహించారు.