ఆలయ నిర్మాణ పనులకు విరాళం అందజేసిన మాజీ జడ్పీటీసీ
JN: లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామంలో శ్రీ కనకదుర్గ మాత ఆలయ నిర్మాణ పనులకు మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి రూ. 25,000 విరాళంగా అందజేశారు. సిరిపురం గ్రామ సమగ్ర అభివృద్ధికి సహకరిస్తామని, గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలన్నారు.