గ్రూప్-1 మెయిన్స్‌కు 619 మంది హాజరు: కలెక్టర్

TPT: తిరుపతిలో సోమవారం నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 911 మంది అభ్యర్థులకు గాను 292 మంది గైర్హాజరయ్యారని, 619 (67.95 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం, తాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.