VIDEO: బైక్ ఢీ.. వృద్ధుడుకి తీవ్ర గాయాలు

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం ఓ బైక్ పాదచారున్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకరయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారకుడైన బైకర్‌ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న శంకరయ్య అనే వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.