కో-ఆప్షన్ సభ్యులకు 11 దరఖాస్తులు
GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు 11 దరఖాస్తులు అందినట్లు కమిషనర్ రాజయ్య తెలిపారు. జనరల్ విభాగంలో 6 దరఖాస్తులు (పురుషులు 2, మహిళలు 4), మైనార్టీ విభాగంలో 5 దరఖాస్తులు (పురుషులు 3, మహిళలు 2) వచ్చాయి. పరిశీలన అనంతరం ఎన్నికల తేదీ ప్రకటిస్తామని తెలిపారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు.