పర్యాటకుల రక్షణ కోసం డ్రోన్‌ వినియోగం

పర్యాటకుల రక్షణ కోసం డ్రోన్‌ వినియోగం

BPT: జిల్లాలోని తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. పర్యాటకుల భద్రతకు ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రాధాన్యం ఇస్తూ డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సూర్యలంక, ఓడరేవు, రామాపురం, పాండురంగాపురం బీచ్‌లకు వారాంతంలో వేలమంది పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లను నియమించి, బీచ్‌లలో పోలీసు అవుట్‌పోస్టులు ఏర్పాటు చేశారు.