మణుగూరులో జోరుగా కురుస్తున్న వాన

మణుగూరులో జోరుగా కురుస్తున్న వాన

BDK: మణుగూరు మండలంలో ఇవాళ జోరు వాన కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. గత కొద్ది రోజులగా ఇదే విధంగా కురిసిన వర్షానికి మండలంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. మణుగూరు సురక్ష బస్టాండ్ వద్ద భారీగా నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, స్పందించి ముందస్తు చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.