స్కూలుకు రాని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
AKP: స్కూలుకురాని విద్యార్థులపై నక్కపల్లి మండలం పెదబోదిగల్లం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు. నేరుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి స్కూలుకు ఎందుకు రావడం లేదో ఆరా తీస్తున్నారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. విద్యార్థులు ప్రతిరోజు స్కూలుకు వచ్చి శ్రద్ధగా చదువుకోవాలని సూచిస్తున్నారు.