యశోదను అభినందించిన డీఈవో

VZM: పదవ తరగతి ఫలితాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గజపతినగరం నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానం, జిల్లాస్థాయిలో తృతీయ స్థానం సంపాదించిన జిన్నా హైస్కూల్‌కు చెందిన పైల యశోదను జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు సోమవారం విజయనగరంలో అభినందించారు. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాల్గొన్నారు.