మల్లయ్యకొండపై అభివృద్ధి పనులకు స్థల పరిశీలన

అన్నమయ్య: తంబళ్లపల్లె మల్లయ్యకొండపై అటవీ శాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు DFO, జగన్నాద్ సింగ్ తెలిపారు. శనివారం FRO, ప్రసాద్ రావుతో కలసి మల్లయ్యకొండను సందర్శించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పూజలు, అభిషేకాలు చేశారు. కొండపై వాచ్ టవర్, ఉద్యాన వనాలు, విశ్రాంతి భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.