మద్యం తెచ్చిన మృత్యువు..!
WGL: చెన్నారావుపేట మండలం ఈరియా తండాలో గురువారం రాత్రి బెల్ట్ షాప్ వద్ద మద్యం కోసం వచ్చిన గణేష్ అనే యువకుడిపై దంపతులు రోకలి బండతో దాడి చేశారు. గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన దంపతులు ఇవాళ ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ ఘటనకు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.