పెబ్బేరులో శివ స్వాములకు అన్నదానం

పెబ్బేరులో శివ స్వాములకు అన్నదానం

WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివభక్తి వాతావరణంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. సూర్యవంశం పరుశురాముడు(జర్నలిస్ట్), జయమ్మ దంపతులు సుమారు 100 మంది శివ స్వాములకు అన్నదానం నిర్వహించారు. ముందుగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం భక్తిశ్రద్ధలతో అన్నదానం చేశారు.