అంగన్వాడీలకు ఫోన్‌లు ఇచ్చిన కలెక్టర్
కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అంగన్వాడీ సిబ్బందికి శాంసంగ్ 5-జీ సెల్‌ఫోన్‌లు పంపిణీ చేశారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్‌లను అందజేశారు. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్‌లు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.