'డా. ఎన్టీఆర్ వైద్య సేవలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు'

కడప: జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవల నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ పథకంపై ఫిర్యాదులు వస్తే ఆస్పత్రులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జరిగిన డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశంలో ఆసుపత్రులపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అందిన ఫిర్యాదులతో అయా ఆసుపత్రుల యాజమాన్యంతో కలెక్టర్ విచారించారు.