పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు.. వాహనదారులు జాగ్రత్త
ASF: పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఆసిఫాబాద్ జిల్లా SP కాంతిలాల్ పాటిల్ మంగళవారం సూచించారు. సరిగా కనపడకపోవడం వలన ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని కోరారు. వాహన హెడ్ లైట్ లను తక్కువ దూరంలో ఉండేలా పెట్టుకోవాలని, వేగాన్ని తగ్గించాలన్నారు. ఎదురుగా వచ్చే వాహనాల శబ్దాన్ని విని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నారు.