'సీఎన్‌జీ దొరకక ట్రిప్పులు కోల్పోతున్నాం'
HYD: పాశ్చాత్య దేశంలో యుద్ధం కారణంగా గ్యాస్ దిగుమతులపై ప్రభావం పడింది. ఫలితంగా CNG సరఫరా తగ్గింది. నగరంలో నిన్నCNG, LPG కొరతతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో కిలో మీటర్ల మేర ఆటోలు క్యూ కట్టాయి. దాదాపు 6 నుంచి 8 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ట్రిప్పులను కోల్పోతూ అవస్థలు పడుతున్నామని పేర్కొన్నారు.