హత్యకేసులో 11మంది నిందితులు అరెస్ట్
GNTR: నగరంలోని సంగడిగుంటలో మణికంఠ(27)పై దాడిచేసి అతని మరణానికి కారణమైన 11 మంది నిందితులను లాలాపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చుట్టుగుంటకు చెందిన యర్రం యశ్వంత్‌కి, మణికంఠతో పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో యశ్వంత్ ఈ నెల 8న మణికంఠతో గొడవపెట్టుకొని అతని స్నేహితులతో కలిసి దాడి చేయగా చికిత్స పొందుతూ మరణించాడు.