రూట్ సెంచరీ.. హమ్మయ్య అనుకున్న హేడెన్
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ సెంచరీ చేయడంపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు అతడు ఓ సవాల్ విసిరాడు. రూట్ ఈ సిరీస్‌లో సెంచరీ చేయకపోతే, మెల్‌బోర్న్ స్టేడియంలో తాను నగ్నంగా పరిగెత్తుతానని హేడెన్ ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు రూట్ సెంచరీ చేయడంతో అతడికి నగ్నంగా పరిగెత్తాల్సిన పని తప్పింది.