ఆశాభావం వ్యక్తం చేసిన రైతులు

KDP: వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్టు వద్ద గురువారం ఉదయానికి 8 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు ఆదినిమ్మాయపల్లెకు చేరుకుంటోంది. గురువారం ఉదయం 1800క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. పెన్నా నది పరివాహక ప్రాంతంలో బోరు బావులలో నీటి శాతం పెరిగి వ్యవసాయానికి నీటి సమస్య తీరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.