88.46% ఓటింగ్ తేల్చిన అధికారులు
MDK: జిల్లాలో ఆరు పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో 88.46శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. 1,63,148 ఓటర్లు ఉండగా 1,44,323 ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. ఎన్నికలలో 89.68% పురుషులు, 87.34% మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 69,933 మంది పురుషులు, 74 వేల 388 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.