ట్రాఫిక్ నియంత్రణకే సిగ్నలింగ్ వ్యవస్థ: MP
నెల్లూరు నగరంలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి నారాయణ, MP వేమిరెడ్డి తెలిపారు. ట్రాఫిక్ నియంత్రించేందుకు రోడ్లపై ఆక్రమణలు తొలగిస్తామని వారు పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని చోట్ల సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు రోడ్డు నిబంధనలు పాటించాలని కోరారు.