అఖండ 2 ప్రీమియర్ షో వీక్షించిన ఎమ్మెల్యే
EG: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కొద్దిసేపటి క్రితం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2 చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి వీక్షించారు. నల్లజర్లలోని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు విచ్చేసి ఎమ్మెల్యే మద్దిపాటితో కలిసి సినిమాను వీక్షించారు.