మదనపల్లి కిడ్నీ రాకెట్‌పై చర్యలు.. ఇద్దరు సస్పెండ్
అన్నమయ్య: మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ కుంభకోణం కేసులో అపోలో డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ శాశ్వతి, మేనేజర్ బాలరంగడు అలియాస్ బాలులను సస్పెండ్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన అపోలో రీజనల్ మేనేజర్ ముఖేష్ బుధవారం సాయంత్రం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో కిడ్నీ వ్యాపారం జరిగినట్లు ఆరోపణలున్నాయి.