పశ్చిమ ప్రాంతాల అభివృద్ధికి ఆదోని జిల్లా అవసరం: సీపీఐ
KRNL: ఆదోని ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం పెద్దకడబూరు మండల సర్వసభ్య సమావేశంలో ప్రత్యేక తీర్మాణం చేయాలని శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ఎంపీపీ శ్రీవిద్యకు వినతిపత్రం అందజేశారు. పశ్చిమ ప్రాంతాల అభివృద్ధికి ఆదోని జిల్లా అవసరమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ యాదవ్ అన్నారు. ఈ లక్ష్యం సాధించే వరకు జరుగనున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.