సోమలలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ

CTR: సోమలలో శుక్రవారం రాత్రి ప్రాంతంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహాన్ని విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు విరాళంగా అందించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన స్వయంగా ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది ఆయన విరాళంగా అందించిన ఏడో విగ్రహమని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో నాగరాజా, బీసీ సెల్ అధ్యక్షుడు జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.