సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

SRCL: చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో వారి చిత్ర పటానికి విద్యార్థులు ఉపాద్యాయులు పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కటుకూరి ముఖేష్ మాట్లాడుతూ.. తను యుద్ద విద్యలు నేర్చుకోవడమే కాదు తన తోటి స్నేహితులకు కూడా యుద్ధ విద్యలు నేర్పిన వ్యక్తి అన్నారు.