'జనసేన పార్టీ ప్రతి గ్రామంలో బలోపేతం కావాలి'
కృష్ణా: జనసేన పార్టీ ప్రతి గ్రామంలో బలోపేతం కావాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వెలువోలు జనసేన అధ్యక్షులు కోనేరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘంటసాల మండలం గోగినేనిపాలెం గ్రామ జనసైనికుడు కుంపటి నాగశ్రీను తన బంధుమిత్రులు, గ్రామస్థులు 12మందిని జనసేన పార్టీలో చేర్చారు.