నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు నిర్వహణ పనుల కారణంగా పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 7వ తేదీ వరకు రద్దు చేశారు. కాచిగూడ - నిజామాబాద్ (77601), నిజామాబాద్ - కాచిగూడ (77602), నిజామాబాద్ - నాందేడ్ (77645), నాందేడ్ - నిజామాబాద్ (77646) రైళ్లు రద్దయ్యాయి.