జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారునికి మంత్రి అభినందనలు

SRD: జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన సంగారెడ్డి పట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ సిద్ధిఖీని మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సర్టిఫికెట్ అందించి ప్రశంసించారు. చిన్న వయసులోని జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ చూపడం అభినందనీయమని తెలిపారు. టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ ప్రావిణ్య పాల్గొన్నారు.