రైలు ఢీకొని మహిళ మృతి

ELR: రైలు పట్టాలు దాటుతున్న మహిళను ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో ఆమె ఘటన స్థలంలోనే మృతి చెందింది. ఈ ఘటన ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్టిపాడు రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలు పొట్టిపాడు ప్రాంతానికి చెందిన చిక్కవరపు లక్ష్మి (30)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు.