VIDEO: రాయవరంలో భారీ చోరీ
అన్నమయ్య: సుండుపల్లి మండలంలోని రాయవరంలో కదిరిచేను స్వర్ణలత అనే మహిళ ఇంట్లో చోరీ జరిగి శనివారం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు 66 గ్రాముల బంగారం, రూ.25 వేల నగదు అపహరించారని భాదితురాలు తెలిపింది. స్వర్ణలత ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లగా, ఇంట్లోకి చొరబడి 2 బీరువాలను తెరిచి విలువైన వస్తువులు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.