'క్యాంటీన్ నిర్వహణ కోసం ధరఖాస్తు చేసుకోవాలి'
ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయం పరిధిలో S.R.శంకరన్ క్యాంటీన్ నిర్వహణ కోసం స్వయం సహాయక సంఘాల నుంచి ధరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ గురువారం తెలిపారు. రెండేళ్ల కాలపరిమితి నిర్వహణ కోసం పాడేరు మండలంలోని గిరిజన స్వయం సహాయక సంఘాలు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి 29వ తేదీలోగా ఐటీడీఏ కార్యాలయంలో ధరఖాస్తులు అందించాలన్నారు.