VIDEO: మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం
ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ రాజబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు, ప్రజల భద్రత వంటి అంశాలపై ఆయన చర్చించారు. అధికారులకు సూచనలు, సలహాలు అందించారు.