'రోడ్డు ప్రమాద బాధితులకి నగదు రహిత వైద్యం'
VZM: రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు రహిత వైద్య సేవలపై శుక్రవారం రాత్రి దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చని MORDH అధికారులు తెలిపారు.