Vivo X300 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్

Vivo X300 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్

వివో తన కొత్త ఫ్లాగ్‌షిప్ X300, X300 Pro సిరీస్‌లను డిసెంబర్ 2న భారత్‌లో విడుదల చేయనుంది. ఇందులో 3nm MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పాటు మెరుగైన ఫోటోగ్రఫీ కోసం V3+ ఇమేజింగ్ చిప్‌ను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, X300 Pro మోడల్‌లో 200MP టెలిఫోటో లెన్స్‌తో కూడిన కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్స్ ధర లాంచ్ అనంతరం తెలుస్తాయి.