'ప్రతి వీధి పరిశుభ్రంగా ఉంచాలి'

KRNL: నగరంలోని ప్రతి వీధి పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కమిషనర్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం పారిశుద్ధ్య తనిఖీదారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు పేరుకుపోకుండా గార్బేజ్‌ను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. 16 శానిటేషన్ డివిజన్లలోని పారిశుద్ధ్య కార్మికులు, శానిటేషన్ పనులు వేగవంతం చేయాలన్నారు.