నెహ్రూ జూ కి రెండు 'నామాల' వానరాలు
HYD: నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో జంతు కుటుంబంలోకి రెండు మాండ్రిల్ జాతి వానరాలు చేరాయి. దాదాపు రెండేళ్ల వయసున్న వీటిని అధికారులు ఎన్‌క్లోజర్‌లో ప్రవేశపెట్టారు. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ జూ నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. బదులుగా రెండు ఆఫ్రికన్ సింహాలను అక్కడి జూకి ఇచ్చారు. అయితే, మాండ్రిల్స్ కోతుల ముఖంపై ఉండే రంగుల వల్ల వాటిని స్థానికంగా 'నామాల కోతులు' అంటారు.