పోలీసుల జోక్యం.. జాతర వివాదం పరిష్కారం..!
KDP: కొత్తపేట గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత నిర్వహించనున్న పెద్దమ్మ జాతర (ఏప్రిల్ 18, 19)కు సంబంధించిన వివాదాన్ని పోలీసులు పరిష్కరించారు. సీఐ నాగ భూషణ్, ఎస్సైలు గ్రామంలో సమావేశం నిర్వహించి ఇరు వర్గాలతో చర్చించి సఖ్యతకు తీసుకువచ్చారు. జాతరను శాంతియుతంగా నిర్వహించాలని గ్రామస్తులకు సూచించడంతో పాటు, భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.