నేటి నుంచి మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలు

WGL: అమరవీరుల వారోత్సవాలను నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. నేటి నుంచి ఆగస్టు 3 వరకు విప్లవోద్యమంలో ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకునేందుకు బహిరంగంగా లేదా రహస్యంగా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. జాగ్రత్తలు తీసుకుని మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.