'కుక్కల బెడదను అరికట్టాలి'
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డుపై వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రజలపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయని మంగళవారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం కుక్కల దాడితో ఒకరు మరణించినా మున్సిపల్ అధికారులు స్పందించలేదని విమర్శించారు. అధికారులు వీధి కుక్కల బెడద నుంచి అరికట్టాలని ప్రజల కోరుతున్నారు.