'విద్యార్థి కౌశిక్ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక విచారణ చేపట్టాలి'
ప్రకాశం: సింగరాయకొండలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో కనిగిరికి చెందిన విద్యార్థి కౌశిక్ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక విచారణ చేపట్టాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కనిగిరి పట్టణ కన్వీనర్ పిసి కేశవరావు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజాసంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో ప్రజాసంకల్ప వేదిక, సిఐటియు నాయకులు సమావేశం జరిగింది. జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక విచారణ జరపాలన్నారు.