అడవి దున్నల భీకర పోరు

అడవి దున్నల భీకర పోరు

NRML: కడెం మండలంలోని గంగాపూర్ అటవీ ప్రాంతంలో అడవి దున్నల పోరు అందరినీ ఆకట్టుకుంది. బుధవారం గంగాపూర్ అటవీ ప్రాంతంలో రెండు అటవీ దున్నలు భీకరంగా కొట్లాడుకున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లిన ప్రకృతి ప్రేమికులు అటవీ దున్నల పోరును తమ సెల్ కెమెరాలలో బంధించారు. అడవిలో జంతువుల మధ్య పోరు సామాన్యమే అయినా దాన్ని చిత్రీకరించడం చాలా అరుదుగా ఉంటుందని వారు వివరించారు.