సర్వేయర్లపై దాడి.. వ్యక్తుల అరెస్ట్

PLD: సర్వేయర్, వీఆర్వో, వీఆర్ఎలపై దాడి చేసిన చల్లా శ్రీనివాసరావు, ఆయన ఇద్దరు కుమారులను అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచామని చిలకలూరిపేట అర్బన్ సీఐ పి. రమేశ్ తెలిపారు. చిలకలూరిపేట డీసీ ఆదేశాల మేరకు 803, 807 సర్వే నంబర్ల ప్రస్తుత స్థితిగతులను తెలుసుకోవడానికి వెళ్లిన అధికారులపై నిందితులు అసభ్య పదజాలంతో దూషించి దాడి చేశారని ఆయన చెప్పారు.