VIDEO: సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన లారీ
MDK: ధాన్యం లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన నార్సింగ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నార్సింగి మిర్జాపల్లి ప్రధాన రహదారిపై సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద పడి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహం ఉండడంతో మృతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.