విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : ఎంపీడీవో

WNP: కొత్తకోట మండలం కానాయపల్లి శివారులోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను ఎంపీడీవో సుదర్శన్ శనివారం తనిఖీ చేశారు. హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించడంతో పాటు స్టోర్ రూం, వంట గదులను, రికార్డులను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించాలని వార్డెన్ సంతోష్ కుమారుకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.