స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తూ యువకుడు మృతి
KDP: ఎర్రగుంట్ల ICL సిమెంట్ పరిశ్రమ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన జరిగింది. మృతుడు YGL శాంతినగర్‌కు చెందిన ప్రసాద్(22)గా గుర్తించారు. ద్విచక్ర వాహనంలో ముద్దునూరులోని మిత్రుని వద్దకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తులసి నాగమురళి వెల్లడించారు.