విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించిన ఉపాధ్యాయుడు..!
KDP: మైదుకూరు బాలికల ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కె. రాధా నరసింహారాజు 2025-26 విద్యాసంవత్సరానికి పదో తరగతి చదువుతున్న 66 మంది విద్యార్థినుల పబ్లిక్ పరీక్ష ఫీజులు కట్టారు. ఇవాళ రూ. 8,250 ను HM గంగాభవాని దేవికి అందజేశారు. గత మూడేళ్లుగా విద్యార్థినుల పరీక్ష ఫీజులను చెల్లిస్తూ, విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న ఆయన సేవా కార్యక్రమం ఆదర్శమని హెచ్ఎం పేర్కొన్నారు.