24న జిల్లాస్థాయి చెస్ పోటీలు
NDL: ఈనెల 24న నంద్యాలలోని అండర్-13 బాల బాలికలకు జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు రవికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలలోపు ఏపీ చెస్ వెబ్‌సైట్లో ఎంట్రీలు నమోదు చేసుకోవాలన్నారు. గెలుపొందిన క్రీడాకారులు మే నెలలో మార్కాపురంలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.